ఓ విద్యార్ధి… నువ్వు నీ భారతం

ఓ విద్యార్ధి… నువ్వు నీ భారతం

విద్యార్ధి అనగా విద్యని అర్థించేవాడు అని అర్థం.. కానీ ప్రస్తుత ధోరణి గమనిస్తే వివిధ రకాలుగా అర్థం( అనగా డబ్బు) కొరకు పరితపించేవారు వాడు విద్యార్ధి అనే పర్యయాన్ని తీసుకోచ్చారు…

విద్యని అభ్యసించే వారు బ్రహ్మ స్వరూపులుగ శాస్త్రాలలో స్తుతించడం జరిగింది, కానీ ఇప్పటి పరిస్థితులు చాల వ్యతిరేఖ దోరణిలో పయనిస్తున్నాయి …सा विद्या या विमुक्तये | అని మన పురాణాలూ విద్య యొక్క అర్థాన్ని ఇలా వివరించాయి, అనగా విద్యాభ్యాసం స్వతంత్ర భావం వైపు నడిపిస్తుంది, ఇక్కడ ముక్తి అనగా స్వర్గ ప్రాప్తి కాదు.. ముక్తి అనగా అరిషడ్వార్గాల [కామా ,క్రోధ , లోభ , మోహ , మద మరియు మాత్సర్య ] నుంచి విముక్తి.. అప్పుడే మనిషి బ్రహ్మ స్వరూపుడు గా గుర్తింప పడుతాడు ..

కానీ ఇప్పటి పరిస్థితి చూసుకుంటే ఇందుకు బిన్నగా ఉంది… విద్యార్థులు జ్ఞాన సంపాదన భావనతో విద్యనూ అభ్యసిన్చాల్సింది పొయి డబ్బు సంపాదన అనే భావనతో విద్యను అభ్యసిన్చుచున్నారు.. ఇలాంటి విషపూరిత భావం మన దేశ స్తితిఫై ఎంతో ప్రభావం చూపింది. మన దేశాని ఉన్నత విలువలు కలగిన మహానుభావులను కలిగిన దేశం నుంచి ఇప్పుడు భిక్షం ఎత్తుతున్న దేశంగా మారింది…. జ్ఞాన ఆర్జన అనే భావాన్ని ఎప్పుడైతే మన విద్య-అర్థులు వదిలేసారో, స్వాత్రంతం వచ్చిన 70 సంవత్సరాలు కావొస్తున్నా మన దేశ భవిష్యతు అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువ బడుతుంది …మనదేశం లో పరిశోధన అనేది తగ్గుతూ వస్తుంది….

స్వామి వివేకానంద గారు విద్య అంటే “end of education is character ” అని విద్య గురుంచి యంతో చక్కగ చెప్పారు.. కానీ ఇప్పటి పరిస్థితి గమనిస్తే “end of character is because of education”.. [వ్యక్తిత్వాన్ని పోగొట్టునది విద్య అనే అర్థాన్ని సంపందిన్చుకుంది] అని మారిపోయింది ….

విలువలు లేని విద్య ఎంత ఉంటె ఏమి లాభం..దీనికి కారణం విద్య వ్యవస్థ మరియు విద్యార్థులు.. విద్య, జ్ఞాన సంపాదన కోరకు అనే విషయం మరిచిపోయి విద్యార్థులు డబ్బులుకు తమని తాము అమ్ముకుంటున్నారు.. వ్యభిచారం చేసే వాళ్ళు శరీరం అమ్ముకుంటేనే తప్పు ఐతేయ్ మరి అన్నిటికన్న పవిత్రమిన మనసుని మరియు బుద్దిని అమ్ముకునే వారిని ఏమనాలి???…

మనదేశం అంతో జ్ఞాన భాండాగారంగా పేరు గాంచిన దేశాన్ని ఇప్పుడు బానిసలూ, కూలీల దేశంగా తాయారు చేసారు… భానిస బతుకు అలవాటు చేసారు …అందుకే మనం ఎపుడూ పోరుగు దేశాల నుంచి అడుక్కుంటూ ఉంటాం .. చాల దేశాలకు కూలి దేశం గా మన దేశాన్ని పరిగణిస్తారు , అందుకే వారి సంస్థ శకలను మన దేశంలో ఒకటి పెట్టి మన ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఉత్తమ విద్యార్థులను వారి పని చేసే కులిలుగా డబ్బు ఏరా వేసి తీసుకెళ్తున్నారు ..

ఇప్పుడు పరిస్థితి గమనిస్తే.. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమాత్రం సంబంధం లేని సివిల్ , బయో-టెక్నాలజీ శాఖల విద్యార్థులను కూడా తమ కంపెనీ లోకి ఎంపిక చేస్తున్నారు …. చేసాక వారి శాఖకు సంభందించిన పనియా!! అంటే కాదు! కంపెనీ వారికీ నచ్చిన పని చేయిస్తారు … విద్యార్థులు 4 సంవస్తరాల చదువు వ్యర్థమేగా మరి … వారి సమయం కూడా వ్యర్తమేగా.!!! అలాంటప్పుడు ఈ కంపెనీలు విద్యార్థులును కూలీలుగా చుస్తున్నట్టేగా మరి !!! వారికీ సంబంధం లేని శాఖలో వేసి కంపెనీకి నచ్చిన పని చేయించుకుంటున్నారు అంటే విద్యార్థులను కులలీలు గా చూసినట్టే గా …. అన్ని శాఖల విద్యార్థులు ఒకే దానిలో ఉండడం వల్ల మిగితా శాఖలు దేశాభివృద్ధి అగినట్టే కదా. మరి ఈ శాఖలు మన దేశానికి అవసరం లేదా అంటే చాల ప్రముఖమినవే అని చెప్పాలి… మరి ఇలా చేయడం వాళ్ళ మా దేశ ప్రతిభావంతులను మనం తుప్పు పట్టిన ఇనుములగా తయారుచేసుకోవడమే కదా !!!!

మన దేశం బాగుపడాలంటే ఇలా విద్యార్థులు విద్యని పట్టభద్రులై మనల్ని మనం అమ్ముకోవడం కోసం కాకుండా, జ్ఞాన అర్జనకోరకు పాటుపడి పరిశోధన వైపు దృష్టిని సారిస్తే మన దేశాన్నికున్న దౌర్భాగ్య దుస్తితినుంచి మనం కాపాడుకోవచ్చు, అంతే గాక మనముందు తరం వారిని కూడా ఇలా అమ్ముడు పోకుండా బానిసత్వపు ఆలోచనలతో కాకుండా మంచి దారిలో పయినింపచేసేటట్టు చెయ్యొచ్చు దీనివలన మన దేశాభివృద్ధి కొరకు పాటుపడినవారు అవ్వచ్చు ……..అన్నిటకన్నా మీరు విద్యార్ధి అయినందుకు అ గొప్ప పేరుని నిలబెట్టుకోవచ్చు …ఇన్ని సంవస్తరాలుగా మీకు గుర్తింపు ఇచ్చిన విద్యకి మేరిచే, ఇవ్వగలిగిన కానుక ఇది ఒక్కటే …

Advertisements

One thought on “ఓ విద్యార్ధి… నువ్వు నీ భారతం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s